
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగి తండ్రీకూతురు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన పెను విషాదం నింపింది. షాద్ నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ, బైక్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మశ్చందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా తండ్రీకూతుర్లు ఇద్దరూ చనిపోయారని సీఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్టాండ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.