అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తుఫాన్ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు పోలీసులు. తుఫాన్ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
