
- ట్రక్కును ఢీ కొట్టిన ప్యాసింజర్ వాహనం.. కానో రాష్ట్రంలో ఘోరం
లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కమర్షియల్ వెహికల్భారీ ట్రక్కును ఢీకొట్టడంతో 21 మంది చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున కానో రాష్ట్రంలో జరియా-–కానో ఎక్స్ ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు.
కమర్షియల్ వెహికల్ డ్రైవర్ రూల్స్ ను ఉల్లంఘించి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని.. వారికి గాయాలయ్యాయని చెప్పారు. నైజీరియాలో రహదారి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 2024లో దేశవ్యాప్తంగా 9,570 సంఘటనలు చోటు చేసుకోగా 5,421 మంది మరణించారు.