ఉగ్రవాదుల చెర నుంచి నా కొడుకును విడిపించండి : తండ్రి నల్లమాస జంగయ్య

ఉగ్రవాదుల చెర నుంచి నా కొడుకును విడిపించండి : తండ్రి నల్లమాస జంగయ్య

యాదాద్రి, వెలుగు: మాలి దేశంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తన కొడుకు ప్రవీణ్​ను విడిపించాలని అతని తండ్రి నల్లమాస జంగయ్య కోరారు. శనివారం కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందించాడు.

 ఇక్కడ ఉపాధి లేక మాలికి వెళ్లి బోర్ వెల్ డ్రిల్లర్​గా పని చేస్తున్న తన కొడుకును గత నెల 23న అక్కడి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిపాడు. స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.