
- ఆటో డ్రైవర్ల కాళ్లావేళ్లా పడి ఇంటికి
- కరీంనగర్ లో పేద తండ్రి దుస్థితి
ఏడేళ్లు కంటికి రెప్పలా పెంచిన బిడ్డ.. ఆ పేద తండ్రి వైద్యం చేయించలేనంత పెద్ద సమస్య వచ్చిచనిపోయింది. మృత దేహాన్ని స్ట్రెచర్ పై తీసుకొచ్చి హాస్పిటల్ మెయిన్ ఎంట్రెన్స్ మెట్ల వద్ద పెట్టారు. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. దవాఖానా ఆఫీసర్లను అంబులెన్స్ అడిగితే.. అవి పనిచేస్తలేవన్నారు. దీంతో కంటికి నాలువరుల నీరు కారుతండగా ఏడ్చుకుంటూ దవాఖానా నుంచి ఆటో స్టాండ్ వరకు బిడ్డ శవాన్ని చేతులపై మోసుకొని వెళ్లాడు . అక్కడ డ్రైవర్లును కాళ్లావేళ్లా పడి బతిమాలుకొని ఇంటికి తీసుకెళ్లాడు . కరీంనగర్ జిల్లా హాస్పిటల్ వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్.. తన కూతురు కోమలత(7) కొన్నాళ్లుగా లివర్ సమస్యతో బాధపడుతుంది. చిన్నారిని కొద్ది రోజుల కింద కరీంగర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పిం చారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అతని వద్ద చేతిలో చిల్లిగవ్వలేదు. అంబులెన్స్ కోసం అధికారులను అడిగితే పని చేయడం లేదని సమాధానం ఇచ్చారు.