బిల్డింగ్‌ పైకి తీసుకెళ్లి.. రెండేళ్ల కొడుకు గొంతు కోసిన తండ్రి

V6 Velugu Posted on Sep 17, 2021

మెహదీపట్నం లంగర్ హౌస్ పరిధిలో దారుణం జరిగింది. కత్తితో రెండేళ్ల కుమారుడి గొంతు కోశాడు ఓ కసాయి తండ్రి. లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కు  చెందిన  హాసిబ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి గత ఆరు సంవత్సరాల క్రితం హస్రత్ బేగంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.  గత మూడు సంవత్సరాలుగా మానసికంగా బాగా లేకపోవడంతో హాసిబ్ ఇంట్లో ఉంటున్నాడు.  అయితే ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం  పెద్ద కుమారుడు ఇస్మాయిల్ ను (2) మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యాడు. ఇంట్లో  భార్య హస్రత్ బేగం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీనీ తరలించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tagged murder, father, strangle, son neck , Mehdipatnam langer house

Latest Videos

Subscribe Now

More News