ప్రభాస్ "ఫౌజీ" బాలీవుడ్ స్టార్ హీరోయిన్... నిజమేనా.?

ప్రభాస్ "ఫౌజీ" బాలీవుడ్ స్టార్ హీరోయిన్... నిజమేనా.?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. సలార్ 2, కల్కి 2, ది రాజాసాబ్, ఫౌజీ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఫౌజీ సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని రెండో లీడ్ గా నటిస్తోందని, త్వరలోనే దిశా పటానికి సంబందించిన గ్లింప్స్ కూడా రిలీజ్ కానున్నాయని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు ఫౌజీ చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ వార్తలు రోజురోజుకి మరింత ఎక్కువవుతున్నాయి. 

దీంతో ఫౌజీ మేకర్స్ దిశా పటాని హీరోయిన్ రోల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా ఈ సినిమాలో దిశా పటాని రెండో లీడ్ రోల్ కోసం ఆమెని సంప్రదించలేదని అలాగే ఫౌజీలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టి పారేశారు. ఫౌజీ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం వేరే హీరోయిన్ ని సెలక్ట్ చేశామని త్వరలోనే అప్డేట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. 

Also Read:-నేను ఆ ఇంట్లోనే ఉండట్లేదు.. లక్ష కరెంట్ బిల్లు ఎలా వేస్తారు..?

ఈ విషయం ఇలా అండగా దిశా పటాని ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో దిశా పటాని రోల్ కి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాగానే కలసి వచ్చింది. అయితే " కల్కి 2" లో మాత్రం దిశా పటానికి ఫుల్ లెంగ్త్ రోల్ ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.