గురుకులాల్లో టీచర్, జేఎల్ పోస్టులు .. తాత్కాలిక భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో టీచర్, జేఎల్ పోస్టులు .. తాత్కాలిక భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఘట్ కేసర్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని సోషల్​వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఇంగ్లిష్​లో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, స్పెషల్ టీచర్స్, హెల్త్ సూపర్ వైజర్లు, పీఈటీ, పీడీతో పాటు లైబ్రేరియన్ వంటి సబ్జెక్టులకు ఈ నెల 30న చిలుకూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఉదయం 8 గంటలు నుంచి బోధన డెమోల నిర్వహణ ఉంటుందన్నారు.

 31న బోటనీ, జూవాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు సంబంధించి డెమో ఉంటుందన్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకొని సకాలంలో హాజరుకావాలన్నారు. జూనియర్ లెక్చరర్​కు రూ. 23.400, పీజీటీ, టీజీటీ టీచర్లకు రూ.18.200 వేతనం ఉంటుందన్నారు.