అంత పెద్ద హోదా లో ఉండి ఇదేం పని.. ఫ్రెండ్ ఇంట్లో మహిళా డీఎస్పీ చోరీ

అంత పెద్ద హోదా లో ఉండి ఇదేం పని.. ఫ్రెండ్ ఇంట్లో మహిళా డీఎస్పీ చోరీ

ఫ్రెండ్ ఇంట్లో మహిళా డీఎస్పీ చోరీ..మొబైల్ ఫోన్, 2 లక్షల నగదు  అపహరణ 

భోపాల్: మ‌‌‌‌హిళా పోలీస్​ ఆఫీస‌‌‌‌ర్ తన ఫ్రెండ్ ఇంట్లో చోరీకి పాల్పడింది. ఓ మొబైల్ ఫోన్ తో పాటు రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లింది. ఈ చోరీ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. భోపాల్​లోని జహంగీరాబాద్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కల్పనా రఘువంశి(56) డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తరచుగా గల్లా మండిలో నివసించే తన స్నేహితురాలు ప్రమీలా తివారీ ఇంటికి వెళ్లేవారు. 

ఈ క్రమంలో సెప్టెంబర్ 24 న ప్రమీల ఇంటికి వెళ్లిన కల్పన.. ఆ ఇంట్లో నుంచి మొబైల్ ఫోన్, రూ.2 లక్షల క్యాష్ ను ఎత్తుకెళ్లారు. ఇంట్లో దాచిన డబ్బు కనిపించకపోయేసరికి ప్రమీల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా డీఎస్పీ కల్పన నిర్వాకం బయటపడింది. దీంతో కల్పనను ఫోన్లో నిలదీయగా ఫోన్ మాత్రం తిరిగిచ్చిందని, డబ్బు ఇవ్వలేదని ప్రమీల తెలిపారు. 

ఆ తర్వాత ప్రమీల తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కల్పనపై అక్టోబర్ 2న పోలీసులు కేసును నమోదు చేశారు. ప్రస్తుతం డీఎస్పీ కల్పన పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.