ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత

తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి  క్రితమే తుదిశ్వాస విడిచారు. తమిళ్ తో  పాటుగా  తెలుగు ప్రేక్షకలను కూడా మనోబాల తనదైన నటనతో అలరించారు.

ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు.  మనోబాల  అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన చివరగా తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో జడ్జి పాత్రలో కనిపించారు.