రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలే: ఫిరోజ్ ఖాన్

రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలే:  ఫిరోజ్ ఖాన్

సికింద్రాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలని సూచించారు. మోండా మార్కెట్ టకార బస్తీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసిన మధుకర్ అండ్ టీం ఆయన అభినందించారు. డ్రగ్స్ తెస్తున్న వారిని ఎన్ కౌంటర్ చేయాలని, వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు డ్రగ్స్ తేవాలంటే భయం ఉండేలా చట్టం ఉండాలని, డ్రగ్స్ వాడుతున్న వారిపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని చెప్పారు. గాంజా మాములుగా తీసుకుంటే టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటే కాల్చి తాగితే 100 శాతం ఉంటుందన్నారు.

డ్రగ్స్పై డీజీపీకి, కమిషనర్కు చాలా సార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద పెట్టి మత్తు పదార్ధాల జోలికి వెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్లనే మర్డర్స్ జరుగుతున్నాయని, రాత్రి పూట పెట్రోలింగ్ ఎక్కువ చేయాలని చెప్పారు. చభూతర్పై రాత్రి 12 గంటల తరువాత ఎవరినీ కూర్చోనివ్వద్దని పోలీసులకు సూచించారు. డ్రగ్స్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చే వారికి అవార్డులు..రివార్డులు ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.