- కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు ఎంపీ ఆర్.కృష్ణయ్య వినతి
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి 50 శాతం సీలింగ్ ను ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు బుధవారం బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడానికి సీలింగ్‌ను ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జనాభా లెక్కలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను పెంచడానికి రాజ్యాంగ పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 243-డి, 243-టిలను సవరించాలని విన్నవించారు. వరప్రసాద్ యాదవ్, కొండ దేవయ్య, రాకేశ్ దత్తా, నివాస్, పరశురామ్ పాల్గొన్నారు.
