జెరేనియం వ్యర్థాలతో ఎరువు..సేంద్రియ వ్యవసాయానికి వరం..హెచ్ సీయూ సరికొత్త ఆవిష్కరణ

జెరేనియం వ్యర్థాలతో ఎరువు..సేంద్రియ వ్యవసాయానికి వరం..హెచ్ సీయూ సరికొత్త ఆవిష్కరణ

గచ్చిబౌలి, వెలుగు: జెరేనియం ఆకుల వ్యర్థాలతో ‘బయోచార్‌’గా (ఎరువు) మార్చే సరికొత్త హరిత సాంకేతికతను హైదరాబాద్ సెంట్రల్​యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. ఇది సేంద్రియ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.  

‘అప్​సైక్లింగ్ ఆఫ్ వేస్ట్ జెరేనియం లీవ్స్ ఇన్​టూ బయోచార్ ఫర్ సాయిల్ అమెండ్​మెంట్’ పేరుతో సాగిన పరిశోధనకు హెచ్​సీయూ లైఫ్ సైన్సెస్​ప్రొఫెసర్ అప్పారావు పొడిలే, ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొ. డా.-ఇంగ్. వి.వి.ఎస్.ఎస్. శ్రీకాంత్ నాయకత్వం వహించారు. 

జెరేనియం నూనె తయారీలో ఏటా వేల టన్నుల ఆకులు వ్యర్థమవుతున్నాయని, ఈ వ్యర్థాన్ని నియంత్రిత పైరాలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్​గా మార్చి నేలలో కలపితే భూమి సారవంతమవుతుందన్నారు. నేలలో కార్బన్ నిల్వ పెరుగడంతోపాటు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం, పోషకాల లభ్యత మెరుగవుతుందన్నారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి, వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.