
మహమ్మద్ నగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : మహ్మద్ నగర్ మండలంలోని రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఎరువుల దుకాణాలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి, మోహన్ రెడ్డి తనిఖీ చేశారు. రైతువేదిక ఆవరణలో మొక్కను నాటారు . నర్వ, తుంకిపల్లె గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించి జీలుగ, జనుము, పచ్చి రొట్ట ఎరువులు వాడాలని సూచించారు.
నర్వ, మహమ్మద్‌నగర్, కోమలంచ, ముక్దుంపూర్ గ్రామాల్లోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసి, రిజిస్ట్రర్లు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఆయనతోపాటు వ్యవసాయ సహాయ సంచాలకులు, బిచ్కుంద అమీనా బి, మండల వ్యవసాయ అధికారి నవ్య, ఏఈవోలు మధుసూదన్‌రావు, రేణుక ఉన్నారు.