ప్రకృతి ప్రేమికుల పండగ.. సిటీ నేచర్​ ఛాలెంజ్​

ప్రకృతి ప్రేమికుల పండగ.. సిటీ నేచర్​ ఛాలెంజ్​

హైదరాబాద్ తో సహా 30కి పైగా భారతీయ నగరాలు సిటీ నేచర్​ ఛాలెంజ్​ పేరుతో ప్రపంచ ప్రకృతి పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా మారాయి. ప్రకృతి ప్రేమికులు వృక్షాలు, జంతువులు, కీటకాలు ఏదైనా ప్రకృతికి దగ్గరి సంబంధం ఉన్న చిత్రాలను తీయాలి. అనంతరం వాటిని "ఐ నేచురలిస్ట్​" అనే యాప్​లో అప్​లోడ్​ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల నుంచి 485 నగరాలు సిటీ నేచర్​ ఛాలెంజ్​లో పాల్గొంటున్నాయి. ఏప్రిల్​ 28 నుంచి మే 1 వరకు నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్- ఇండియా, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, ది నేచురలిస్ట్ స్కూల్‌తో సహా ప్రముఖ వన్యప్రాణి సంస్థలు బెంగళూరు, బొంబాయి, హైదరాబాద్ , ఢిల్లీ తదితర నగరాల్లో ఈ ఈవెంట్‌ను జరపనున్నాయి.

శాస్ర్తవేత్తలకు ఉపయోగకరంగా సమాచారం..

యాప్​లో అప్​లోడ్​ చేసిన డేటా శాస్ర్తవేత్తలు, పరిశోధకులకు చేరుతుంది.  మొక్కలు, జంతు జాతులను పరిశోధించడానికి, ఒక ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.  డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా హైదరాబాద్ ఆఫీస్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తాంపాల్ మాట్లాడుతూ, “ఈ ఈవెంట్‌తో పాల్గొనే వ్యక్తులు,  స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ గ్రూపులు హైదరాబాద్‌పై ఆసక్తిని కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లో సిటిజన్ సైన్స్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదే తొలిసారి" అని అన్నారు.  బాంబే నేచురల్​అసిస్టెంట్​ డైరెక్టర్​ శ్రీ సోహైల్​ మదన్​ మాట్లాడుతూ..  పట్టణ ప్రాంతాలపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులకు బలమైన సమాచార సేకరణకు సాధనంగా సీఎన్ సీ ఉపయోగపడుతుందన్నారు. పట్టణీకరణ కారణంగా కాంక్రీట్​ జంగిల్​గా మారిన ప్రాంతవాసుల్లో ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని పేర్కొన్నారు.