తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ దసరా

తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ దసరా

దసరా. తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ. పల్లె, పట్నం తేడా అందరూ సంబురంగా చేసుకుంటారు. అత్తగారింటికెళ్లిన ఆడబిడ్డలు కూడా ఈ పండుగకి సొంతూళ్లకొచ్చి ఆనందంగా ఆడిపాడతారు. ‘జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే’’.. అంటూ అమ్మవారికి ఘనంగా పూజలు చేస్తారు.  ఘుమఘుమలాడే పిండి వంటలు, యాట కూర ప్రతీ ఇంట్లో  ఉండి తీరాల్సిందే. పట్నం నుంచి పల్లెలకు పోయి అంతా కలిసి పండుగ జరుపుకుంటారు. దుర్గమ్మ పూజలు చేసి.... జమ్మి ఆకును బంగారంగా పంచుకొని అలయ్... బలయ్ చేసుకుంటారు. విజయదశమి రోజు పాలపిట్టని చూస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. దసరా నాడు గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూజలు చేస్తారు. దసరా రోజు ఎర్రటి పట్టు వస్త్రాలు కట్టుకొని పూజలు చేస్తే రాజరేశ్వరీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి ముందు ఎర్రటి అక్షింతలు, ఎర్రటి గాజులు పెడతారు. ఆయుధ పూజలు చేస్తారు.