పండుగ ఆఫర్లు షురూ.. త్వరలో ఫ్లిప్‌‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’

పండుగ ఆఫర్లు షురూ.. త్వరలో ఫ్లిప్‌‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’

ఈ నెల 16 నుంచి 21 వరకు

న్యూఢిల్లీ: వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌‌ను ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 21 వరకు కస్టమర్ల ముందుకు రాబోతున్నట్టు పేర్కొంది. తన పాత, కొత్త కస్టమర్లకు పెద్ద మొత్తంలో ప్రొడక్ట్‌‌లను ఆఫర్ చేయనున్నామని చెప్పింది. ఈ సేల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  చిన్న సంస్థలకు, సెల్లర్లకు గ్రోత్ అవకాశాలను కల్పించనున్నామని పేర్కొంది. ఫ్లిప్‌‌కార్ట్ పోటీ కంపెనీ అమెజాన్ కూడా తన సేల్ డేట్స్‌‌ను వచ్చే వారం ప్రకటించనుంది. స్నాప్‌‌డీల్  నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సమయంలో అంటే అక్టోబర్  మధ్యలో తన తొలి ఫెస్టివ్ సేల్‌‌ను తీసుకొస్తోంది.  తర్వాత రెండు సేల్స్ అక్టోబర్ చివరన, నవంబరులో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫెస్టివ్ సీజన్‌‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్‌‌ వంటి కొన్ని కేటగిరీలకు భారీగా డిమాండ్ ఉంటుందని అంచనా. రెడ్‌‌సీర్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఫెస్టివ్ సేల్స్ రెండింతలు పెరిగి 7 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.

For More News..

రిలీజైన గంటల్లోనే యూఎస్‌‌ బెస్ట్ సెల్లర్‌‌ లిస్ట్‌‌లో చేరిన ప్రియాంక బుక్

పాత కారు కొనడానికి రైట్​ టైం ఇదే!