హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ లోన్ల విలువ రూ.30.61 లక్షల కోట్లు

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ లోన్ల విలువ రూ.30.61 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రుణ వృద్ధి అంచనాలను అందుకుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి గ్రాస్​అడ్వాన్సులు (ఇచ్చిన అప్పులు) 15.4 శాతం వృద్ధితో రూ.30.61 లక్షల కోట్లకు చేరాయి. సగటు డిపాజిట్లు 13.3 శాతం వృద్ధితో రూ.30.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో సగటు కాసా డిపాజిట్లు 11.2 శాతం పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

గతంలో మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామాతో తలెత్తిన కార్పొరేట్ గవర్నెన్స్ వివాదాలపై స్వతంత్ర న్యాయ సమీక్ష క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో బ్యాంక్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. బ్యాంక్ కొత్త పార్ట్‌‌టైమ్ ఛైర్మన్‌‌‌‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ నుంచి పునీత్ శర్మ సీఎఫ్‌‌‌‌ఓ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 18న పూర్తి ఫలితాలు వస్తాయి.