పంచాయతీరాజ్ ఎన్నికల్లో నోటాకు చాన్స్ ఇవ్వండి : పద్మనాభరెడ్డి

పంచాయతీరాజ్ ఎన్నికల్లో నోటాకు చాన్స్ ఇవ్వండి : పద్మనాభరెడ్డి
  •     ఈసీకి ఎఫ్​జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాదిరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం నోటాకు అవకాశం ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. శనివారం రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధిని ఎఫ్ జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విద్య  కలిసి వినతిపత్రం అందించారు. హర్యానా, మహారాష్ర్ట, ఢిల్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో నోటా అమలవుతుందని, త్వరలో రాష్ర్టంలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా దీనిని అమలు చేయాలని  కోరారు.