ఎన్నికల ఖర్చుపై ఆడిట్ నిర్వహించాలి: ఎఫ్‌‌‌‌జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి

ఎన్నికల ఖర్చుపై ఆడిట్ నిర్వహించాలి: ఎఫ్‌‌‌‌జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఖర్చును ఎలక్షన్‌‌‌‌ కమిషన్ ఆడిట్ చేయించి ఈసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌‌‌జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీల నేతలు రూ.622 కోట్లు ఖర్చు చేశారని మీడియాకు ఈసీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, ఎంపీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరాదని రూల్స్ ఉన్నాయన్నారు. 

అయితే, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో రూ.622 కోట్లు ఖర్చు చేశారని, అంటే ఒక్కో సీటుకు యావరేజ్‌‌‌‌గా రూ.35.58 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఖర్చుపై సీఈవోను ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగితే 7 నెలలు దాటినా లెక్కలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల ఖర్చుపై అడ్వకేట్ జనరల్‌‌‌‌తో ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు.