తెలంగాణ సచివాలయం దగ్గర ఫియట్ కారు బీభత్సం

తెలంగాణ సచివాలయం దగ్గర ఫియట్ కారు బీభత్సం

హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్-ఎన్టీఆర్ మార్గ్‌ రూట్లో ఫియట్ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో వచ్చి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆదివారం (ఆగస్ట్ 10) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు గురించి ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కారులో ఉన్న ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియదు. మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.