
హైదరాబాద్, వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 15వ ఇండియా క్లైమేట్ పాలసీ అండ్ బిజినెస్ కాన్‌క్లేవ్‌ను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్లైమేట్ పాలసీ, కార్బన్ మార్కెట్ రంగాలపై చర్చలు జరిగాయి. పారిస్ ఒప్పందం, నెట్ జీరో లక్ష్యాలు, ఆర్టికల్ 6 మెకానిజమ్‌లు, క్లీన్ఎనర్జీ వంటి అంశాల గురించి కూడా నిపుణులు మాట్లాడారు.