
లవ్స్టోరీల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల(Shekahr kammula) ‘ఫిదా’(Fida) సినిమా గురించి చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కోసమే తాను ఫిదా స్టోరీని రాసుకున్నట్టు ఈ డైరెక్టర్ గతంలో చెప్పి షాకిచ్చాడు. మహేశ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone)ను అనుకున్నాడట. మహేశ్‌కు ఈ కథ విపరీతంగా నచ్చడంతో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశాడట.
కానీ, ఆఖరి నిమిషంలో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. అలా ఈ సినిమా వరుణ్ తేజ్(Varun Tej), సాయి పల్లవి(Sai Pallavi)ని వరించింది. ‘ప్రేమమ్(Premam)’ బ్యూటీ లేని ఫిదాను ఆడియెన్స్ అస్సలు ఊహించుకోలేరు. అంతలా ఆమె క్యారెక్టర్ ఆకట్టుకుంది. ఈ హీరోయిన్ సొంత డబ్బింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇక మహేశ్ మాట అటుంచితే సాయి పల్లవి రోల్‌ను ఒకవేళ దీపికా చేసుంటే ఫిదా డిజాస్టర్‌గా నిలిచేదంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.