
కరీంనగర్, యాదాద్రి, వెలుగు: వరి రైతు గోసపడుతున్నడు. ఎన్నో ఆశలతో దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, చీడపీడల నుంచి కా పాడుకుం టున్న పొలం కళ్లముం దే ఎండిపోతుంటే చూసి తల్లడిల్లుతున్నడు. వేలకు వేలు పెట్టిన పెట్టుబడులు వస్తయో రావోనని బుగులు పడుతున్నడు. ఎండుతున్నపొలాన్ని చూడలేక ట్యాం కర్లతో గొంతు తడుపుతున్నరైతులు కొందరైతే.. ఆశలు చంపుకొని పంటను పశువులకు వదిలేస్తున్నవారు ఇంకొందరు! కరీం న-గర్ , యా దాద్రి జిల్లా లతోపాటు రాష్ట్రం లో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నయి.
వట్టిపోతున్న బోర్లు
ఉమ్మడి కరీం నగర్ జిల్లా లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండటంతో బోరుబావుల్లో నీరు పాతాళానికి చేరింది. నార్లు పోసిన టైంలో ఓ మోస్తారుగా నీళ్లు పోసిన బోర్లు, బావులు వట్టిపోయాయి. దీంతో రబీలో రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న చేలు ఎండిపోతున్నా యి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోని గంగాధర, చొప్పదండి, హుజురాబాద్ డివిజన్ లోని వీణవంక, ఇల్లంతకుం ట, సైదాపూర్ మండలాల్లో ఈ పరిస్థితి కన్పి స్తోంది. జగిత్యాల జిల్లా లో మెట్ పల్లి, మల్లా పూర్, కథలాపూర్ మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల,కాల్వ శ్రీరాం పూర్, మంథని, అంతర్గాం ప్రాంతంలో పరిస్థితి కరువును తలపించేలా ఉంది. సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.ఉమ్మడి కరీం నగర్ లోని గంగాధర మండలంలోసుమారుగా 20 మీటర్ల లోతులో నీళ్లున్నా యి.చొప్పదండి మండలంలో 19 మీటర్లు, చి గురుమా-మిడి మండలంలో 17.5 , మంథనిలో 23 మీటర్లు,అంతర్గాం మండలాల్లో 20 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. సిరిసిల్ల, వీర్నపల్లి మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఆగస్టులో కురిసినవర్షాలకు కొద్ది గా కరీం నగర్ లో భూగర్భ జలాలు పెరిగినా.. రెండు నెలలు గడిచేసరికే రెండు మీటర్ల లోతుకు పడిపోయాయి. సరిగ్గా పంటలు చేతికొ-చ్చే టైంలోనే బోర్లు ఎండిపోతుం డటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఎండీలో ప్రస్తుతం 6టీఎంసీల నీటి ఉంది. డెడ్ స్టో రేజీ 2 టీఎంసీలు. నిత్యం కరీం నగర్ తోపాటు, వివిధ పట్టణాలకు తాగునీరు,ఆవిరి రూపంలోనే 250 క్యూ సెక్కులు పోతోం ది.మిగిలిన నీటిని వచ్చే వానాకాలం వరకు కా పాడుకో-వాలి. లేదంటే సాగునీటికే కా దు.. తాగునీటికే ముప్పుఏర్పడుతుంది.
కరీంనగర్‌లో…
జగిత్ యాల జిల్లా లోని కథలాపూర్, ఇబ్రహీంపట్నం ,మేడిపల్లి, మల్లా పూర్, మెట్ పల్లి మండలాల్లో వరి,మొక్కజొన్న, పసుపు పంటలు ఎండుతున్నా యి.కథలాపూర్ మండలం కలికోటలోని సూరమ్మ రిజ-ర్వాయర్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.దీంతో మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని దాదాపు 42 వేల ఎకరాలకు నీరందడం లేదు.పెద్దపల్లి జిల్లా ఓదెల, శ్రీరాం పూర్ మండలాల్లోనిఎస్సారెస్పీ డి 86, డి 83 కాల్వ చివరి భూములు నీళ్లు లేక ఎండిపోతున్నా యి. కాల్వ శ్రీరాం పూర్ మండలంలో హుస్సేన్ మియా వాగుపై కట్టిన చెక్ డ్యాంను ఎస్సారెస్పీ నీటితో నిం పేవారు. దీంతోవరి, మొక్కజొన్న పంటలకు, వేసవిలో పశువులకుతాగునీటి అవసరాలు తీ రేవి. కా నీ గత ఐదేళ్లుగాఎస్సారెస్పీ డ్యాం లో నీళ్లున్నా వదలడం లేదు.
యాదాద్రి భువనగిరిలో..
జిల్లా లో గతేడాది ఈ సమయంలో 9.23 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈసారి 14 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో బావులు, బోర్లు వట్టిపోతున్నా యి.చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, సంస్థా న్ నారా-యణపురం, బొమ్మలరామారం, ఆలేరు,రాజాపేట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూ రు-(ఎం) తదితర మండలాల్లో వరి చేలు ఎక్కడికక్కడఎండిపోతున్నాయి. ఇప్పటి కే దాదాపు 10 వేలహెక్టార్లకు పైగా ఎండిపోయాయి.-మూసీ తీ రం వెం ట మండలాల్లో సాగైన పంటలకుఅంత ఇబ్బంది లేకపోయినా మిగతా మండలాల్లో దుర్బి క్ష పరిస్థితులు కన్పిస్తున్నాయి. పశువులకు కూడా నీళ్లు దొరకడం లేదు.
నీళ్లు ఎప్పుడిస్తరో..
నాకు పోతారంలో నాలుగెకరాల వరి పొలం ఉంది. సూరమ్మ రిజర్వాయర్ నుంచిసాగునీరు అందక పంట ఎండిపోతోంది.రెండు బోర్లు వేసినా సరిపడినంత నీళ్లు లేకపంట కాపాడుకోలేకపోతున్న. అధికారులుసాగునీరు ఎప్పుడూ ఇస్తరో చెప్పాలే. – బుర్ర రాజ మల్లయ్యరైతు, పోతారం, జగిత్యాల
మూడెకరాలు ఎండిపోయింది
మా పొలం పక్కనే ఎస్సారెస్పీ కాల్వఉండడంతో మూడున్నర ఎకరాల్లో వరి వేశా.ఇప్పటికే రూ.65 వేల పెట్టు బడి అయింది.కాలువ నీళ్లు సకాలంలో రాక, బావిలో నీళ్లు లేక పొలం ఎండిపోయింది. ప్రస్తు తం బావిలోఉన్న నీళ్లతో 20 గుం టల పొలం పారుతుం ది. కాల్వలు నమ్ముకొ ని సాగు చేస్తే నష్టపోయే పరిస్థితి వచ్చింది.- మ్యాకల లక్ష్మీనారాయణ రుక్మాపూర్ , కరీంనగర్