ఫ్రీగా World Cup టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్.. ఫిఫా ఇచ్చిన షాక్‌కి మైండ్ బ్లాక్.. 

ఫ్రీగా World Cup టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్.. ఫిఫా ఇచ్చిన షాక్‌కి మైండ్ బ్లాక్.. 

FIFA World Cup 2026 Tickets: ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) టికెట్ల కోసం ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఆరాట పడుతున్నారు.. కొందరికి మాత్రం అసలు ఒక్క రూపాయి కట్టకుండానే "ఫ్రీగా" టికెట్లు బుక్ అయిపోయినాయి. ఏంది నమ్మబుద్ధితలేదా? కానీ ఇది పక్కా నిజం.. అయితే ఈ ఫ్రీ ముచ్చట వెనుక ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. టికెట్లు ఫ్రీగా వచ్చిన ఆనందంలో అభిమానులు ఎగిరి గంతేసే లోపే.. ఫిఫా (FIFA) అధికారులు ఎంట్రీ ఇచ్చి గట్టి షాక్ ఇచ్చిండ్రు. 

వెబ్‌సైట్ గ్లిచ్‌తో ఫ్రీగా టికెట్లు: 
అసలేం జరిగిందంటే.. మే 21వ తేదీన ఫిఫా అఫీషియల్ వెబ్‌సైట్ ([FIFA.com/tickets](https://FIFA.com/tickets))లో టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పుడు ఒక సాంకేతిక లోపం (Website Glitch) తలెత్తింది. దాంతో చెకౌట్ పేజీలో టికెట్ ధర "0 USD" అని చూపించింది. ఇది చూసి ఫ్యాన్స్ ఇంకేం ఆలోచించకుండా గబుక్కున బుక్ చేసేసుకున్నారు. ఇలా సుమారు 60 మంది ఫ్యాన్స్ ఫ్రీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. 

ఫిఫా రివర్స్.. పైసలు కడితేనే టికెట్: 
ఈ ముచ్చట ఫిఫా దగ్గరకి చేరడంతో సీన్ రివర్స్ అయింది. జూన్ 3వ తేదీన ఆ 60 మంది కస్టమర్లకు ఫిఫా మేనేజ్మెంట్ ఒక ఎమర్జెన్సీ ఈమెయిల్ పంపింది. సాంకేతిక లోపం వల్ల మీకు జీరో (0) డాలర్లకే టికెట్లు వచ్చిన మాట నిజమే.. కానీ ఆ టికెట్లను మేము క్యాన్సిల్ చేస్తున్నామని తేల్చి చెప్పేసింది.

ALSO READ : ఆరుగురు బ్యాటర్లా? ఇద్దరు ఆల్‌రౌండర్లా?

ఫ్యాన్స్ మరీ ఫీల్ అవ్వకుండా మంచి ఆఫర్: 
వెబ్‌సైట్ తప్పు వల్ల జరిగిన ఇబ్బందికి మేము క్షమాపణలు చెప్తున్నాం.. అయితే మీరు మ్యాచ్ మిస్ అవ్వకుండా ఉండటానికి.. ఆ టికెట్లను మీ అకౌంట్ లోనే రిజర్వ్ చేసి పెట్టాం.. ఈ మెసేజ్ వచ్చిన 7 రోజుల్లోగా అసలైన టికెట్ ధర ఎంతో అంత పైసలు కట్టి ఆ టికెట్లను మళ్లీ క్లెయిమ్ చేసుకోండి.. లేకపోతే టికెట్లు వెరే వారికి ఇస్తామని ఫిఫా మేనేజ్మెంట్ పేర్కొంది. 

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధరలు: 
ఈ ఫ్రీ టికెట్ల గొడవ ఒక పక్క ఉంటే.. ఇంకో పక్క ఫిఫా వరల్డ్ కప్ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్ మంటుంది. మొన్న ఏప్రిల్‌లో ఫిఫా రీసేల్ సైట్‌లో జూలై 19న న్యూజెర్సీలో జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం నాలుగు టికెట్లను అమ్మకానికి పెట్టారు. వాటి ధర ఎంతో తెలుసా? ఒక్కో టికెట్ అక్షరాలా 2.3 మిలియన్ డాలర్లు (అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.19 కోట్లకు పైనే). స్టేడియంలో గోల్ పోస్ట్ వెనుక ఉండే సీట్లకే ఈ రేంజ్ ధరలు ఉంటే.. ఇక నార్మల్ టికెట్ల కోసం జనాలు ఎంత కొట్టుకోవాలో అర్థం చేసుకోవచ్చు..