ఆరుగురు బ్యాటర్లా? ఇద్దరు ఆల్‌రౌండర్లా? ఆఫ్ఘన్ టెస్ట్‌కు గిల్ స్కెచ్ అదుర్స్!

ఆరుగురు బ్యాటర్లా? ఇద్దరు ఆల్‌రౌండర్లా? ఆఫ్ఘన్ టెస్ట్‌కు గిల్ స్కెచ్ అదుర్స్!

IND vs AFG Test: రేపటి నుంచే (2026, జూన్ 6) న్యూ చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ షురూ కాబోతుంది. అయితే మ్యాచ్ స్టార్ట్ కాకముందే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ (Playing 11) కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో బరిలోకి దిగుతుందా? లేక ఇద్దరు ఆల్‌రౌండర్లను దించి బౌలింగ్‌ను స్ట్రాంగ్ చేసుకుంటుందా? అన్నదే ఇప్పుడున్న అసలైన సస్పెన్స్. 

ఓపెనర్లు ఫిక్స్.. నంబర్ 3 దగ్గరే అసలు ఫైట్: 
* ఓపెనింగ్ జోడీ: టీమిండియా ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ జోడీ పక్కా అనిపిస్తోంది. రాహుల్ ఈ మధ్య పెద్ద స్కోర్లు చేయకపోయినా.. అతనికున్న ఎక్స్‌పీరియన్స్ ప్లస్ పాయింట్.. జైస్వాల్ ఎట్లాగో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

* నంబర్ 3 రేసులో ఇద్దరు: మూడో నంబర్‌లో ఆడటానికి సాయి సుదర్శన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపిన దేవదత్ పడిక్కల్ కూడా ఈ ప్లేస్ కోసం గట్టిగా పోటీ ఇస్తున్నాడు. చూడాలి మరి కెప్టెన్ గిల్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో అనేది. 

* మిడిల్ ఆర్డర్ సెట్: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 4 లో రావడం ఖాయం.. ఆ తర్వాత రిషభ్ పంత్ 5వ నంబర్‌లో దిగి రచ్చ లేపనున్నాడు.

* ఇక 6వ నంబర్ ముచ్చట: అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది మామ బ్రోస్.. ఒకవేళ భారత్ ఆరుగురు ప్రాపర్ బ్యాటర్లతో వెళ్లాలనుకుంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ని తుది జట్టులోకి తీసుకుంటారు.. కానీ, బౌలింగ్ ఆప్షన్ కూడా కావాలనుకుంటే మాత్రం మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా టెస్ట్ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.

ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. టీం బ్యాలెన్స్ కోసం నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరినీ కలిసి ఆడించే ఛాన్స్ ఉంది. సుందర్ ఆఫ్ స్పిన్, నితీష్ పేస్ బౌలింగ్‌తో పాటు ఇద్దరూ బ్యాటింగ్ కూడా గట్టిగా చేయగలరు కాబట్టి జట్టుకి బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుందని వెల్లడించారు.

స్పిన్ మాయ.. పేస్ తడాఖా: 
న్యూ చండీగఢ్ పిచ్‌పై మన స్పిన్నర్లు ఆఫ్ఘన్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మెయిన్ వెపన్‌గా మారబోతున్నాడు. పేస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లీడ్ చేయనున్నారు.

లాస్ట్ ప్లేస్ ఎవరిది?: 
ఈ పిచ్‌పై రివర్స్ స్వింగ్ ఉంటే: స్థానిక పంజాబ్ ఎక్స్‌ప్రెస్, యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ టెస్ట్ డెబ్యూ చేయొచ్చు. డొమెస్టిక్ కింగ్స్ హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్ లలో ఒకరు మూడో స్పిన్నర్‌గా టీమ్‌లోకి వస్తారు.

టీం ఇండియా ప్లేయింగ్ 11: 
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ / దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి / ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.. పిచ్ పరిస్థితులని బట్టి ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే ఛాన్స్: గుర్నూర్ బ్రార్ / హర్ష్ దూబే / మానవ్ సుతార్