జ్యోతిష్యం : ఆరు రాశులకు మూడు గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారి ఇంట్లో కనకవర్షమే..!

జ్యోతిష్యం :  ఆరు రాశులకు  మూడు గ్రహాల అనుగ్రహం.. ఆ రాశుల వారి ఇంట్లో కనకవర్షమే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు, బుధుడు, కుజుడు గ్రహాల సంచారం ఆధారంగా జూన్​ 20 ఆరు రాశులకు శుభ యోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం గురుడి శుభ దృష్టి .. బుధుడు తన సొంతరాశి కర్కాటక రాశిలో.. అలాగే కుజుడు సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో ఈనెల ( జూన్ ) 20 వరకు సంచరిస్తారు. దీని ప్రభావం వలన ఆరు రాశుల వారికి ( మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన ) వ్యక్తిగత జీవితంలో మార్పులు రావడంతో ఉద్యోగం.. వ్యాపారం.. ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. . .!

మేషరాశి:  కుజుడితో పాటు బుధుడు,, గురుడు సంచారం వలన ఈ రాశి వారికి  ఈ నెల 20 వరకు  అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ఈ సమయం జాబ్​ మారేందుకు అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.  వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.   పెళ్లి.. ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిథునరాశి:  రాశ్యధిపతి బుధుడు, లాభ స్థానంలో ...  కుజుడు, ధన స్థానంలో... గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  మూడు గ్రహాల అనుకూల స్థితి వలన ఈ రాశి వారికి ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది.  అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి  రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గరుడు... బుధుడు.. కుజుడు సంచారం వలన  అనేక విధాలుగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం కావడంతో మనశ్శాంతి లభిస్తుంది. కేరీర్​ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. . ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి.  కొత్తగా  పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

కన్యారాశి: ఈ రాశికి గురు, బుధుల అనుకూలత బాగా పెరిగినందువల్ల  ఆశించిన ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారు అన్నీ రంగాల్లో విజయం సాధిస్తారు.  ప్రతి పనిలోనూ  మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది.  ఉద్యోగస్తుల విషయంలో  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.   వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. . ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.మీ పాత బంధువులను కలిసే అవకాశంతోపాటు.. . కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

తులారాశి: ఈ రాశి వారికి కుజుడు.. గురుడు.. బుధుడు అనుగ్రహం  వలన  రాజ యోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు.   ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.  కొత్తగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విహార యాత్రలు చేయడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

మీనరాశి: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో శుభ దృష్టి , కుజుడు.. బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది.  అనుకున్న పనులు అనుకున్న విధంగా ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది.  వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు.  కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.  విదేశీ వ్యాపారాలు కలసి వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో  మీరే చక్రం తిప్పే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి బంధువర్గంలోని వారితో కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.