ఫుట్‌బాల్ ప్రపంచ కప్లో తీవ్ర విషాదం.. ఫ్యాన్ మృతితో దిగ్భ్రాంతి

ఫుట్‌బాల్ ప్రపంచ కప్లో తీవ్ర విషాదం.. ఫ్యాన్ మృతితో దిగ్భ్రాంతి

FIFA World Cup 2026: ఒక వైపు ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీతో ప్రపంచం మొత్తం పండుగ చేసుకుంటుంటే.. మెక్సికో సిటీలో మాత్రం ఘోరం జరిగింది. ఫుట్ బాల్ టోర్నమెంట్‌ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందే స్టేడియం బయట ఒక అభిమాని గుండె ఆగి చనిపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాదకరమైన ఘటనతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.  

గేట్ కాడనే కుప్పకూలిన అభిమాని: 
మెక్సికో సిటీలో ఉన్న ఫేమస్ 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియం బయట దారుణం జరిగింది. జర్మనీ దేశానికి చెందిన ఒక 80 ఏళ్ల ముసలాయన మ్యాచ్ చూడటానికి మస్తు ఖుషీగా వచ్చాడు. స్టేడియం లోపలికి పోవడానికి గేట్ కాడ లైన్ల నిలబడ్డ టైమ్‌లోనే.. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్, స్టేడియం స్టాఫ్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

కాపాడాలని చూసినా లాభం లేకపాయె: 
అక్కడ ఉన్నోళ్లు వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌కు ఫోన్ చేయగా.. డాక్టర్లు, పారామెడిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ను ఎట్లైనా కాపాడాలని మస్తు ట్రై చేశారు. కానీ అతడ్ని బ్రతికించడానికి అక్కడే నేలపై పడుకోబెట్టి గుండెపై నొక్కుతూ సీపీఆర్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కానీ పాపం.. ఎంత ప్రయత్నించినా ఆ పెద్దాయన ప్రాణాలు మాత్రం దక్కలేదు.

భారీ వచ్చిన ఫ్యాన్స్:  
ఈసారి వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేయడంతో.. స్టేడియం గేట్లు తీయడానికి 4 గంటల ముందే వేల సంఖ్యలో జనాలు అక్కడ జమా అయ్యారు. మెక్సికో నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఫుట్‌బాల్ అభిమానులంతా కార్లు, బస్సులు వేసుకుని వచ్చారు. అంతా కేకలు వేస్తూ, పాటలు పాడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న టైమ్‌లోనే ఈ ముసలాయన చనిపోవడంతో.. ఒక్కసారిగా స్టేడియం బయట ఉన్న జనాలంతా సైలెంట్ అయ్యారు.