FIFA World Cup: అల్జీరియాకు తొలి విజయం.. జోర్డాన్పై గెలుపు

FIFA World Cup: అల్జీరియాకు తొలి విజయం.. జోర్డాన్పై గెలుపు

శాంటాక్లారా: 2014 తర్వాత  ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అల్జీరియా తొలి విజయాన్ని సాధించింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–జె లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 2–1తో జోర్డాన్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. నిజార్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌ రష్దాన్‌‌‌‌‌‌‌‌ (36) గోల్‌‌‌‌‌‌‌‌తో జోర్డాన్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలోకి వెళ్లినా.. అల్జీరియా సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో వ్యూహాత్మకంగా ఆడి అడ్డుకట్ట వేసింది.

 69వ నిమిషంలో రియాద్‌‌‌‌‌‌‌‌ మహ్రెజ్‌‌‌‌‌‌‌‌ కొట్టిన కార్నర్‌‌‌‌‌‌‌‌ కిక్‌‌‌‌‌‌‌‌ను నధీర్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌బౌలి హెడర్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌గా మలిచాడు. ఆ వెంటనే దాడులను పెంచినా అల్జీరియా 82వ నిమిషంలో మరో చాన్స్‌‌‌‌‌‌‌‌ లభించింది. కార్నర్‌‌‌‌‌‌‌‌ కిక్‌‌‌‌‌‌‌‌ను అమీన్‌‌‌‌‌‌‌‌ గౌరి గోల్‌‌‌‌‌‌‌‌గా మలిచి అల్జీరియా విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఓటమితో జోర్డాన్‌‌‌‌‌‌‌‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అల్జీరియా నాకౌట్‌‌‌‌‌‌‌‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆస్ట్రియాతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిస్తే నేరుగా నాకౌట్‌‌‌‌‌‌‌‌కు చేరుతుంది.