రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

నిజామాబాద్ క్రైం, వెలుగు: రూ. 170 కోసం ఫ్రెండ్స్​ మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.నిజామాబాద్ రూరల్ సౌత్ జోన్ సీఐ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ యాదవ్, రామశంకర్, వికాస్ పటాక్ నెహ్రూనగర్ పరిధిలోగల కాస్టింగ్ యూనిట్‌లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పక్కనే ఉన్న మరో ఫ్యాక్టరీలో విద్యాశంకర్, అజిత్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ ఐదుగురు కలిసి సోమవారం రాత్రి నెహ్రూనగర్ ప్రాంతంలో మందు పార్టీ చేసుకున్నారు. అందుకోసం ఒక్కొక్కరు రూ.250 చొప్పున పోగు చేశారు. అయితే   పోగుచేసిన డబ్బులో రూ.170 మిగిలాయి. వికాస్​ పటాక్ ​మిగిలిన డబ్బులు తనకు ఇవ్వాలంటూ అరవింద్ యాదవ్‌తో గొడవ పడ్డాడు. వారి మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అరవింద్ అక్కడ కనిపించిన కర్రతో వికాస్ తలపై బలంగా కొట్టాడు. వికాస్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో మిగతా నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. నెహ్రూనగర్ గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు అరవింద్ యాదవ్, రామ శంకర్ పై కేసు నమోదు చేసినట్లు 6వ టౌన్ ఎస్సై గౌరేందర్ తెలిపారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

For More News..

పోలీస్‌స్టేషన్ బాత్‌రూంలో ఉరేసుకున్న నిందితుడు

సర్పంచ్‌గా గెలిచి.. ఊరికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ..

50 ఏండ్ల తర్వాత కనిపించిన అరుదైన అడవి కుక్క