
బర్త్ డే వేడుకల్లో దారుణం జరిగింది. అప్పటి వరకు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు స్నేహితులు కాసేపటికే ఒకరినొకరు కత్తితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జనగామ జిల్లాలో జిగింది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో బర్త్ డే పార్టీలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. బర్త్ డే వేడుకల్లో మద్యం సేవిస్తుండగా తనకు తాగిన గ్లాసులో మద్యం పోశారంటు రాజశేఖర్ అనే వ్యక్తి చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్ లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ముగ్గురి మధ్య ఘర్షణ నెలకొంది.
అక్కడి నుంచి గ్రామానికి చేరుకున్న చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్ లు రాజశేఖర్ తండ్రికి జరిగిన గొడవ చెప్పారు. ఆగ్రహాంతో చెరుకు వెంకటేశ్ పై కత్తితో దాడి చేశాడు రాజశేఖర్. ఈ ఘర్షణలో అడ్డు వచ్చిన కీర్తి వెంకేష్ ను కత్తితో దాడి చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. చెరుకు వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.