గుంటూరు కారం నుండి మరోకరు ఎలిమినేట్.. బిగ్ బాస్ కంటే గోరంగా ఉందిగా!

గుంటూరు కారం నుండి మరోకరు ఎలిమినేట్.. బిగ్ బాస్ కంటే గోరంగా ఉందిగా!

మనలో చాలామంది బిగ్ బాస్(Bigg Boss) చూస్తూనే ఉంటారు కదా? అందులో వారానికొకరు చొప్పున హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు గుంటూరు కారం(Guntur kaaram) సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమా నుండి కూడా ఒక్కొక్కరుగా బయటకు విచ్చేస్తున్నారు.

మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) వంటి స్టార్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడం కూడా మరో విశేషం. అలాంటిది ఈ సినిమా నుండి ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్లడం చూస్తుంటే ఇది గుంటూరు కారం సినిమానా లేక  బిగ్ బాస్ హౌసా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ సినిమా నుండి ఇప్పటికే పూజ హెగ్డే(Pooja hegde) బయటకు వచ్చేసింది. ఆమె స్థానంలో ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary)ని తీసుకున్నారు. ఇటీవల కెమెరామెన్ పీఎస్ వినోద్(PS Vinodh) కూడా గుంటూరు కారం నుండి బయటకు వచ్చేశారు. ఆయన స్థానంలో రవి కే చంద్రన్(Ravi k chandran) ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్(Ram laxman) కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వరుసగా ఇలాంటి న్యూస్ వినిపిస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. తరువాత కొన్ని కారణాల షూటింగ్ ఆగిపోయింది. కథ మార్చేశారంటూ కామెంట్స్ వినిపించాయి. దీంతో అప్పటివరకు తీసిన ఫుటేజ్ అంతా డిలీట్ చేసి మల్లి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇలా గుంటూరు కారం సినిమాకు ఎదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.