V6 News

FIH మెన్స్ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌: కాంస్యమైనా దక్కేనా?

FIH మెన్స్  జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌:  కాంస్యమైనా దక్కేనా?

చెన్నై: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా కీలక పోరుకు రెడీ అయ్యింది. బుధవారం జరిగే బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అర్జెంటీనాతో తలపడనుంది. తొమ్మిదేళ్ల తర్వాత టైటిల్‌‌‌‌ గెలిచే అవకాశాన్ని మరోసారి మిస్‌‌‌‌ చేసుకున్న ఇండియా కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గెలిచి ఫ్యాన్స్​లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. 

రెండుసార్లు చాంపియన్‌‌‌‌ అయిన అర్జెంటీనా నుంచి ఇండియాకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. దీన్ని అధిగమించాలంటే బ్యాక్‌‌‌‌లైన్‌‌‌‌ పొజిషన్‌‌‌‌లో ఇండియా బలంగా ఆడాల్సి ఉంటుంది. పూల్‌‌‌‌ దశలో చిన్న ప్రత్యర్థులపై అద్భుతంగా ఆడిన ఫార్వర్డ్స్‌‌‌‌.. కీలక మ్యాచ్‌‌‌‌లో చేతులెత్తేశారు.

 దిల్రాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, సౌరభ్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ కుష్వాహా, గుర్జోత్‌‌‌‌ సింగ్‌‌‌‌, అజిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌లాంటి ప్లేయర్లు అవకాశాలను సృష్టించుకున్నా వాటిని గోల్స్‌‌‌‌గా మల్చలేకపోయారు.   కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ నేతృత్వంలోని ఇండియా డిఫెన్స్‌‌‌‌.. అర్జెంటీనాను నియంత్రించాలంటే చాలా ఉన్నతంగా ఆడాల్సి ఉంది. మిడ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌లోనూ సమన్వయ లోపం కనిపిస్తోంది.