న్యాయం చుట్టూ మఫ్తీ పోలీస్

న్యాయం చుట్టూ మఫ్తీ పోలీస్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘మఫ్తీ పోలీస్’.  దినేష్ లెట్చుమనన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని జి.అరుల్ కుమార్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. 

కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’  అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టోరీ ఐడియాని ప్రజెంట్ చేస్తోంది.  అర్జున్ యాక్షన్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది.  ఇన్వెస్టిగేషన్ సీన్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి.  

ఈ చిత్రంలో  అభిరామి, రామ్‌‌‌‌‌‌‌‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై ఇతర పాత్రలు పోషించారు.  శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తుండగా,  ఆశివాగన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.