ఈ నకిలీ IAS, IPS ఆఫీసర్ మామూలోడు కాదు. రియల్ ఆఫీసర్స్ కూడా అంత కటింగ్ ఇవ్వరేమో. ఆయనకు ఇద్దరు బాడీగార్డ్స్.. వాళ్లు కూడా అల్లాటప్పా కాదు. ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్లు. గన్ లైసెన్స్ కలిగిన ఆర్మీ వ్యక్తులను బాడీగార్డ్స్ గా పెట్టుకోవటమే కాదు.. సైరన్ ఉన్న వాహనంలో తిరుగుతూ.. నిజమైన ఆఫీసర్ ను మించి బిల్డప్ ఇస్తూ.. డబ్బులు కమాయించుడుకు అలవాటు పడ్డాడు. యాపారం ఎప్పుడూ ఒకేలా సాగుతుందా.. చిట్టచివరికి పోలీసులకు చిక్కాడు ఈ ఫేక్ ఐఏఎస్.
నకిలీ IAS, IPS ఆఫీసర్ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్. ఫేక్ ఆఫీసర్ ను ఫిలిం నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితుడు ఐఏఎస్, ఐపీఎస్ పేరుతో బెదిరింపులు , మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. బుధవారం (నవంబర్ 26) అరెస్టు చేసిన ఫిలింనగర్ పోలీసులు.. నిందితుడి నుంచి నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఫేక్ ఆఫీసర్ పేరు బత్తుల శశికాంత్. వసూళ్ల వేటలో.. షేక్ పేట్ పరిధిలో ఒక జిమ్ లో బాడీ గార్డ్స్ ను చూపించిఇద్దరి దగ్గర 18 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నిందితుడి నుంచి 2 మొబైల్ ఫోన్స్, ఆరు సిమ్ కార్డ్స్, ఇతర గాడ్జెట్స్ తో పాటు ఫేక్ ఐడి కార్డ్స్ సీజ్ చేశాము. గన్ లైసెన్స్ కలిగిన రిటైర్డ్ ఆర్మీ వ్యక్తులను బాడీ గార్డ్స్ గా నియమించుకుని సైరన్ వాహనంలో తిరిగే వాడు.
ఫేక్ ID కార్డ్స్ ను క్రియేట్ చేసి IAS, IPS, NIA అధికారిగా గా చెలామణి అవుతున్నాడు. వ్యక్తి గత భద్రత కోసం లైసెన్స్ గన్స్ తీసుకున్న వాళ్ళు జాబ్ పర్పస్ లో గన్స్ వాడకూడదు. నిందితుడు బత్తుల శశికాంత్ కు గార్డ్స్ గా ఉన్న ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటాము.. అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
