రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలియజేశారు.
స్టంట్ మాస్టర్స్ అనల్ అరసు, రియల్ సతీష్ ఫైట్ సీన్స్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారని, ఇటీవలి కాలంలో చూడనటువంటి డిఫరెంట్ యాక్షన్ సీన్స్‌ను ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారని చెప్పారు. యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఇందులోని కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అన్నారు. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ద్వారా రివీల్ చేశారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
