సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోండి

సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోండి

తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని పరిశ్రమలు, బిజినెస్ లు మూతపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీలకు సంబంధించిన షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఊరటను కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. నేటి నుంచి తమ రాష్ట్రంలో సినిమా, టీవీ షోస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవచ్చని సోమవారం తమిళనాడు సర్కార్ ప్రకటించింది.

షూటింగ్ లు పూర్తి చేసుకున్న మూవీలకు సంబంధించిన పనులు చేసుకునేలా అనుమతించాలని కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో వెలువడిన ఈ నిర్ణయాన్ని సినీ జనాలు స్వాగతిస్తున్నారు. తాజా గవర్నమెంట్ డెసిషన్ తో ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, ఫోలే, వీఎఫ్ ఎక్స్/సీజీఐ, డిజిటల్ ఇంటర్ మీడియరీ వర్క్స్ చేసుకునేందుకు ఆస్కారం కలిగింది. అయితే వర్క్ టైమ్ లో 15 కంటే ఎక్కువ మంది ఉండొద్దని సర్కార్ షరతు విధించింది.