హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆసుపత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతిలిచ్చింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు పేర్కొన్నారు. 968 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 2029 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో, 127 పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మొదలుకొని సెక్యూరిటీ గార్డు వరకు ఉన్నాయి.
