ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2020లో ఆదాయపన్నుపై కీలక ప్రకటన చేశారు. అంతకుముందున్న 3 శ్లాబులను 6 శ్లాబులకు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షలలోపు ఆదాయమున్న వారికి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయమున్న వారికి 5 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయమున్నవారికి 10శాతం పన్ను విధించారు. రూ. 7.5 నుంచి 10 లక్షల ఆదాయమున్న వారికి 15శాతం, రూ. 10 నుంచి 12 లక్షల ఆదాయమున్న వారికి 20 శాతం, రూ. 12.5 నుంచి రూ. 15 లక్షల ఆదాయమున్న వారికి 25 శాతం, మరియు రూ. 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయమున్నవారికి 30 శాతం పన్ను విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.
