మిషన్ భగీరథకు 19,205 కోట్లు కావాలె: కేంద్రాన్ని కోరిన హరీష్ రావు

మిషన్ భగీరథకు 19,205 కోట్లు కావాలె: కేంద్రాన్ని కోరిన హరీష్ రావు

మిషన్ భగీరథకు 19,205 కోట్లు, 
మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆర్థిక సహకారం ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన హరీష్ రావు

అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల సాధికారతను పెంచేలా కేటాయింపు లు జరపాలని హరీష్ సూచించారు.  జిఎస్టీ, ఐజిఎస్టీ బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వాలని, టాక్స్ చెల్లింపు దారుల కోసం ఆమ్నెస్టీ పథకం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆయన కోరారు.

తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు 450కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ ను హరీష్ కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతిఅయోగ్ ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించాలని.. మూడేళ్ల కాల వ్యవధికి  మిషన్ భగీరథకు 19,205 కోట్లు, మిషన్ కాకతీయ కు 5 వేల కోట్లు ఇవ్వాలని రొక్వెస్ట్ చేశారు.  దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని.. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలిని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు హరీష్ రావు.