వరల్డ్ టాప్-100 పవర్‌ఫుల్ మహిళల లిస్ట్‌లో 16 ఏళ్ల అమ్మాయి

వరల్డ్ టాప్-100 పవర్‌ఫుల్ మహిళల లిస్ట్‌లో 16 ఏళ్ల అమ్మాయి
  • ఫోబ్స్ – 2019 పవర్‌ఫుల్ మహిళ జాబితా విడుదల
  • నిర్మలా సీతారామన్ సహా ముగ్గురు భారత నారీమణులకు స్థానం

ప్రపంచంలో శక్తిమంతమైన 100 మంది మహిళ లిస్టును ఫోబ్స్ ప్రకటించింది. ఇందులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మనోళ్లు ముగ్గురు ఉన్నారు. 16 ఏళ్ల స్వీడన్ అమ్మాయి గ్రెటా కూడా ఈ జాబితాలో స్థానం సాధించడం విశేషం. పర్యావరణవేత్త అయిన ఆమె 100వ స్థానంలో నిలిచింది.   ఫోబ్స్- 2019 ప్రపంచంలోనే 100 మంది మోస్ట్ పవర్‌ఫుల్ లిస్టులో జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ టాప్‌లో ఉన్నారు. వరుసగా తొమ్మిదేళ్లుగా ఆమె ఫోబ్స్ పవర్‌ఫుల్ మహిళల జాబితాలో తొలిస్థానాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (రిజర్వు బ్యాంక్) ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే, మూడో స్థానంలో అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 29వ స్థానంలో నిలిచారు.

తొలిసారే 34వ స్థానంలోకి నిర్మలా సీతారామన్

కిరణ్ మంజుదార్ షా

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి ఫోబ్స్ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచంలో టాప్ -100 మోస్ట్ పవర్‌ఫుల్ మహిళల్లో 34వ స్థానంలో నిలిచారామె. మోడీ ప్రభుత్వం తొలి టర్మ్‌లో 2017 సెప్టెంబరు 3 నుంచి 2019 మే 30 వరకు ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. తొలిసారి పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ సీతారామనే. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా.. రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

ఇక భారత్ నుంచి HCL కార్పొరేషన్ సీఈవో రోషినీ నాడార్ మల్హోత్ర, ఫార్మా కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా.. ఫోబ్స్ లిస్టులో  54, 65 స్థానాల్లో నిలిచారు.

రోషినీ నాడార్

పవర్‌ఫుల్ మహిళల లిస్టులో 16 ఏళ్ల అమ్మాయి

ఫోబ్స్ 2019 పవర్‌ఫుల్ మహిళల లిస్టులో బిల్ & మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ (6), ఐబీఎం సీఈవో గిన్నీ రొమేట్టీ (9), ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (18), న్యూజిలాండ్  ప్రధాని జసిండా (38), అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ (42), సింగర్స్  రిహన్నా (61), బెయాన్స్ (66), టేలర్ స్విఫ్ట్ (71), టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ (81)  వంటి ప్రముఖులకు స్థానం దక్కింది. తొలిసారి ఈ లిస్టులో ప్లేస్ సాధించిన క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా (100వ స్థానం) వయసు 16 ఏళ్లే కావడం విశేషం. ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని గుర్తించి.. ఫోబ్స్ ఈ జాబితాలో చోటు కల్పించింది. కాగా, ఈ ఏడాది నిర్మలా సీతారామన్, గ్రెటా సహా 23 మంది కొత్తగా ఫోబ్స్ పవర్‌ఫుల్ మహిళల లిస్టులో స్థానం సాధించారు.

గ్రెటా

MORE NEWS:

గ్రేట్‌‌‌‌‌‌‌‌ గ్రెటా: 3 వేల కిలోమీటర్ల కాలుష్యం లేని జర్నీ

గ్రెటాకు ‘ఆల్టర్నేటివ్​ నోబెల్​’

121 ఏళ్ల క్రితం ఉద్యమకారిణి మళ్ళీ పుట్టిందా..!