10,105 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

10,105 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 పోస్టుల భర్తీకి అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల్లో 9096 గురుకుల పోస్టులు ఉన్నాయి. వీటిలో మైనార్టీ గురుకులాల్లో 1445, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. 

గురుకుల పోస్టులతో పాటు టీఎస్పీఎస్సీ ద్వారా 995 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 316, మహిళా శిశు సంక్షేమ శాఖలో 251, బీసీ  సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ కొత్తగా అనుమతించిన పోస్టులతో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 45,325 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.