
రాయికల్, వెలుగు: రాయికల్ పట్టణానికి చెందిన అనాథ యువతి సంధ్య వివాహా ఖర్చులకు విశ్వశాంతి హైస్కూల్ నిర్వాహకుడు మచ్చ గంగాధర్ శుక్రవారం రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు. తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన యువతిని ఎలాంటి లాంఛనాలు లేకుండా పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ముందుకు వచ్చాడు. పెళ్లి ఖర్చులకు దాతల నుండి ఆర్థిక సాయం కోరగా పలువురు స్పందించి సాయం చేస్తున్నారు. కార్యక్రమంలో సామాజిక సేవకుడు కడకుంట్ల జగదీశ్వర్, స్కూల్సిబ్బంది పాల్గొన్నారు.