బంగారం ధర రూ.1,500 జంప్.. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర ఎంతంటే..

 బంగారం ధర రూ.1,500 జంప్.. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర ఎంతంటే..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్​ కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు ఎగబాకాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,500 పెరిగి రూ. 1,27,300కు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ. 4,000 పెరిగి రూ. 1.60 లక్షలు పలికింది. అమెరికాలో వడ్డీ రేట్ల కోత ఆశలు, సురక్షిత పెట్టుబడి డిమాండ్ దీనికి కారణం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 1.14 శాతం పెరిగి 4,114 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సు 52.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్​లో 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ. 1,14,450కి చేరగా,  24 క్యారెట్ల బంగారం రూ. 1,24,860 ఉంది. కిలో వెండి రూ. 1.76 లక్షలకు ఎగబాకింది.