
సిడ్నీ: స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా టీమ్‌కు జరిమానా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో కేటాయించిన టైమ్‌లో వేయాల్సిన ఓవర్ల కంటే ఒకటి తక్కువగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తేల్చారు. దీంతో టీమ్ మొత్తానికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇండియా ఓ ఓవర్ తక్కువగా వేసింది. కాబట్టి ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కూడా ఫైన్ పడింది. కెప్టెన్ కోహ్లీ తప్పిదాన్ని అంగీకరించాడు. కాబట్టి ఎలాంటి విచారణ లేకుండా కేవలం జరిమానాతో సరిపెట్టాం’ అని ఐసీసీ వెల్లడించింది.