మెట్రోలో మాస్క్​ లేకుంటే ఫైన్

మెట్రోలో మాస్క్​ లేకుంటే ఫైన్

7 నుంచి ఎల్బీనగర్​– మియాపూర్​ రూట్​లో స్టార్ట్

గాంధీ, ముషీరాబాద్​, భరత్​నగర్, మూసాపేట్​, యూసుఫ్​గూడ స్టేషన్లు క్లోజ్​

సికింద్రాబాద్​, వెలుగు: కరోనా లాక్​డౌన్​తో ఇన్నాళ్లు ఆగిపోయిన మెట్రో రైళ్లు.. ఈ నెల 7 నుంచి మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. మూడు విడతల్లో రైళ్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఎల్బీనగర్​– మియాపూర్​ లైన్​లో మెట్రో రైళ్లు నడవనున్నాయి. రెండో విడతలో 8 నుంచి నాగోల్​– రాయదుర్గం, మూడో విడతలో 9 నుంచి ఎంజీబీఎస్​– జేబీఎస్​ రూట్లలో సర్వీసులు నడుపనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏడు, ఎనిమిదో తేదీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వీసులు నడుస్తాయన్నారు. 9వ తేదీ నుంచి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నడుస్తాయన్నారు. ఐదు స్టేషన్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. గాంధీ హాస్పిటల్​, ముషీరాబాద్​, భరత్​నగర్​, మూసాపేట, యూసుఫ్​గూడ స్టేషన్లు మూసే ఉంటాయన్నారు. స్మార్ట్​ కార్డ్​ ద్వారానే ప్రయాణాలు చేయాలని ప్యాసింజర్లకు సూచించారు. స్టేషన్లలో టికెట్ల జారీని నిలిపేస్తున్నట్టు చెప్పారు. ఆన్​లైన్​లోనే స్మార్ట్​ కార్డ్​ను రీచార్జ్​ చేసుకోవాలన్నారు. ప్యాసింజర్లు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, లేకుంటే ఫైన్​ వేస్తామన్నారు. మాస్కులు పెట్టుకున్నది లేనిదీ.. సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తున్నది లేనిదీ..  సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఉంటామన్నారు. లక్షణాలున్న వ్యక్తులు దగ్గర్లోని టెస్టింగ్​ సెంటర్లలో టెస్టులు చేసుకుని, అటెస్టేషన్​ తీసుకురావాలన్న రూల్​ పెట్టారు.