జనాలకు ఫైన్లు..సెక్రెటరీలకు సస్పెన్షన్లు

జనాలకు ఫైన్లు..సెక్రెటరీలకు సస్పెన్షన్లు
  • సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు
  • పంచాయతీల యాక్షన్ ప్లాన్ లో ఉన్నతాధికారుల చర్యలు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీల యాక్షన్ ప్లాన్ అమలులో కార్యదర్శుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు జనాలకూ ఉన్నతాధికారులు ఫైన్లు వేస్తున్నారు. ఈ నెల 6 నుంచి 30 రోజుల పాటు అన్ని గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, వ్యర్థాల తొలగింపు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం యాక్షన్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు పాల్గొంటున్నారు. అయితే యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేపట్టాల్సిన పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేస్తున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ హరీష్ ఎలికట్ట, నాగులపల్లి గ్రామాలకు సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న వైవీ రాజును సస్పెండ్ చేశారు. ఇరు గ్రామాల సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిని పదవుల నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో అడిగారు.

హరితహారంలో 200 సస్పెన్షన్లు 

యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కాకముందు హరితహారం పేరుతో అన్ని జిల్లాల్లో జూనియర్, సీనియర్ పంచాయతీ కార్యదర్శులను, ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టర్లు సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా200 మందిని సస్పెండ్ చేశారు. దీనిపై కొన్ని జిల్లాల్లో మంత్రులు సైతం జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనిపై కార్యదర్శులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన టార్గెట్ మేరకు మొక్కలు నాటలేదని మహబూబ్ నగర్, నల్లొండ జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు సస్పెండ్ చేశారు.

ఫైన్లు వేయడంపై జనం ఫైర్

కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఫైన్ల హవా కొనసాగుతోంది. మొక్కలు తొలగించినందుకు, మొక్కలను మేకలు, పశువులు తిన్నందుకు, చెత్త వేసినందుకు జరిమానాలు వేస్తున్నారు.

Fines for the people .. Suspensions for secretaries