ఫోన్​పే నుంచి ఇండస్ యాప్ స్టోర్​

ఫోన్​పే నుంచి ఇండస్ యాప్  స్టోర్​

న్యూఢిల్లీ: గూగుల్​ యాప్ ​స్టోర్​కు పోటీగా ఫిన్​టెక్​ సంస్థ ఫోన్​పే  ఇండస్ యాప్‌‌స్టోర్  కన్జూమర్ ​వెర్షన్‌‌ను ప్రారంభించింది.  ఈ యాప్ స్టోర్ ద్వారా యూజర్లు 45 కేటగిరీ లలో 2 లక్షలకు పైగా మొబైల్ అప్లికేషన్‌‌లను,  గేమ్‌‌లను డౌన్‌‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ యాప్‌‌లు 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంటాయి.  యాప్ స్టోర్​ను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా చేయడానికి సరికొత్త షార్ట్- వీడియో ఆధారిత డిస్కవరీ ఫీచర్‌‌ను కూడా అందిస్తున్నామని ఫోన్​పే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. డెవలపర్‌‌లను ప్రోత్సహించడానికి, ఇండస్​ యాప్​ స్టోర్​వచ్చే ఏప్రిల్ వరకు (ఒక సంవత్సరం పాటు) యాప్ లిస్టింగ్ ఫీజులను వసూలు చేయదు.