స్టార్​ షట్లర్‌‌ లక్ష్యసేన్‌‌పై ఏజ్‌ఫ్రాడ్‌‌కేసు

స్టార్​ షట్లర్‌‌ లక్ష్యసేన్‌‌పై ఏజ్‌ఫ్రాడ్‌‌కేసు

న్యూఢిల్లీ:  ఇండియా నంబర్‌‌ వన్‌‌‌ షట్లర్‌ లక్ష్యసేన్, అతని ఫ్యామిలీ, నేషనల్‌‌ కోచ్‌ విమల్‌‌కుమార్‌‌పై చీటింగ్‌, ఏజ్‌ఫ్రాడ్‌‌ కేసులో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌ నమోదైంది. కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌ అయిన 21 ఏండ్ల లక్ష్యసేన్, అతని అన్న చిరాగ్‌‌సేన్‌‌ తమ ఏజ్‌ను తక్కువగా చూపించి 2010 నుంచి ఏజ్‌–గ్రూప్‌ టోర్నమెంట్స్ ఆడుతున్నారని గోవియప్ప నాగరాజ అనే వ్యక్తి ఆరోపించారు.

సేన్‌‌ తండ్రి, స్పోర్ట్స్‌‌‌‌‌‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్ అయిన ధీరేంద్ర, తల్లి నిర్మల, పదేళ్లకు పైగా సేన్‌బ్రదర్స్ కు కోచింగ్‌ ఇస్తున్న విమల్‌‌కుమార్‌‌‌పై గురువారం బెంగళూరులో ఫిర్యాదు చేశారు. దాంతో, వీళ్లందరిపై చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌ నమోదైంది. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సేన్ బ్రదర్స్‌ బెంగళూరులోని ప్రకాశ్‌‌పదుకోన్‌‌ బ్యాడ్మింటన్‌‌‌ అకాడమీలో విమల్‌ కుమార్‌‌ దగ్గర ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను విమల్‌‌ ఖండించాడు. సేన్‌‌‌‌‌ను మానసికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు.