Mahadev App Case: బెట్టింగ్ యాప్ కేసులో.. ఛత్తీస్గఢ్ మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్

Mahadev App Case:  బెట్టింగ్ యాప్ కేసులో.. ఛత్తీస్గఢ్ మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్

ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మహదేవ్ యాప్ కేసులో సంబంధమున్న కొంతమందితోపాటు భూపేష్ బఘేల్పై రాయ్ పూర్ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది. భూపేష్ బఘేల్ తోపాటు 21 మందిపై పలు సెక్షన్ల కింద ఆర్థిక నేరాల ఏజెన్సీ కేసు నమోదు చేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ మహాదేవ్  యాప్ కేసులో చత్తీస్ గఢ్ కు చెందిన బ్యూరోక్రాట్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉండటంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. 

ఫిబ్రవరిలోఈ కేసులో 9వ నిందితుడిని అరెస్ట్ చేసింది సెంట్రల్ ఏజెన్సీ. చత్తీస్ గఢ్ లో బడా రాజకీయ నేతలు, బ్యూరాక్రాట్లకు లంచంగా మనీట్రాన్స్ ఫర్ చేసేందుకు ఈ యాప్ ద్వారా వచ్చిన డబ్బును వినియోగించినట్లు ఈడీ గుర్తించింది. మహదేవ్ యాప్ ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ , చెల్లింపులపై లింకులున్నాయనే ఆరోపణలతో బాలీవుడ్ యాక్టర్లతో సహా చాలా సెలబ్రిటీలు.. ఈ కేసులో నోటీసులు, విచారించింది.  ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు సౌరభ్ చంద్రకర్ రవి ఉప్పల్ లపై ఈడీ రెండు ఛార్జీషీట్ లు దాఖలు చేసింది. 

ఫిబ్రవరి 2023లో యూఏఈ లోని రాస్ అల్ ఖైమాలో సౌరభ్ చంద్రకర్ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు రూ. 200 కోట్ల నగదు ఖర్చు చేశారని ఈడీ మొదటి ఛార్జీషీట్ లో ఆరోపించింది. చంద్రకర్ బంధువులు భారత దేశం నుంచి యూఏఈ కి తీసుకెళ్లడానికి  ప్రైవేట్ జెట్ లను అద్దెకు తీసుకున్నట్లు , పెండ్లిలో పాల్గొనేందుకు సెలబ్రిటీలను డబ్బులు చెల్లించారని పేర్కొంది. ఈ కేసులో మొత్తం 6వేల కోట్లు ఆర్థిక నేరం జరిగినట్లు ఈడీ పేర్కొంది. 

2023 నవంబర్ లో చత్తీస్ గఢ్ ఎన్నికల మొదటి దశకు ముందు భూపేస్ బఘేల్ కు మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు దాదాపు రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. అయితే బఘేల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయం అని ఆరోపించారు.